గ్రంథాలయ సెస్ బకాయిలు సీఎం దృష్టికి తీసుకువెళ్లడంపై గ్రంథాలయ ఉద్యోగుల హర్షం
మచిలీపట్నం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన గ్రంథాలయ సెస్ బకాయిల అంశాన్ని 08.05.2026న జరిగిన రాష్ట్ర కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీకి గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
గ్రంథాలయ సెస్ బకాయిల కారణంగా గత మూడు నెలలుగా సిబ్బంది జీతాలు, పెన్షన్లు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పలుమార్లు కార్యదర్శి వి రవికుమార్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారంపై తాను ఎల్లప్పుడూ దృష్టి ఉంచుతున్నానని కలెక్టర్ బాలాజీ భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, కలెక్టర్ల సదస్సులో గ్రంథాలయ సెస్ బకాయిల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం పట్ల గ్రంథాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. చట్టపరమైన పరిధిలో సెస్ బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ బాలాజీని గ్రంథాలయ ఉద్యోగులు వారి చాంబర్లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి. రవి కుమార్, డిప్యూటీ లైబ్రేరియన్ బీరం వెంకటరమణ, సీనియర్ అసిస్టెంట్ ఇన్‌చార్జ్ ఐ.వి.వి. రామారావు, కార్యాలయ సిబ్బంది, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

