MachilipatnamLocal News
September 5, 2026
కృష్ణా యూనివర్సిటీ

నర్సులే నిజమైన ప్రాణదాతలు – కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య కె రాంజీ

  • May 12, 2026
  • 1 min read
నర్సులే నిజమైన ప్రాణదాతలు – కృష్ణా యూనివర్సిటీ వీసీ ఆచార్య కె రాంజీ

మచిలీపట్నం :

రోజులో 24 గంటల పాటు సేవలందిస్తున్న నర్సులే నిజమైన ప్రాణదాతలు అని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ కొనియాడారు. మంగళవారం అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా రాంజీ ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశంలో కేరళ రాష్ట్రం లో నర్సింగ్ వృత్తిని హాబీ గా మార్చుకుని పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కేరళ రాష్ట్రం కు చెందిన నర్సులు గల్ఫ్, యూరోప్ దేశాలలో పెద్ద సంఖ్యలో పనిచేస్తుండటం గర్వకారణమన్నారు. అత్యవసర సమయాలలో డాక్టర్ లు అందుబాటులో లేకపోయినా నర్సులే ప్రాణాలు రక్షిస్తున్న విషయాన్ని విస్మరించకూడదన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ మార్కండేయులు, నర్స్ పద్మజ, బోధనేతర సిబ్బంది నాంచారయ్య, బ్రహ్మాజీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *