MachilipatnamLocal News
May 5, 2026
జిల్లా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం కు 126 అర్జీలు

  • May 4, 2026
  • 0 min read
[addtoany]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం కు 126 అర్జీలు

మచిలీపట్నం :

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, మెప్మా పిడి సాయిబాబు, డీఎస్పీ శ్రీనివాసరావు లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక… మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

కలెక్టరేట్లో మొత్తం 126 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది. అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:

కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని నరసింహపురం రహదారిలో ఉన్న స్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆ గ్రామవాసులు జూపూడి సుభాష్ చంద్రబోస్, పిఎస్ఎన్ రవి, టి శ్రీనివాసులు, పి.రఘు తదితరులు అర్జీ అందజేశారు.

మచిలీపట్నం పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ కొడాలి శర్మ మాట్లాడుతూ సమీపంలోని కేజీ బేసిన్లో లభ్యమవుతున్న సమృద్ధి గల సహజ వాయువును సమర్థవంతంగా వినియోగించుకుని మచిలీపట్నంలోని ప్రతి గృహానికి పైప్ నేచురల్ గ్యాస్ (పిఎన్జి )సౌకర్యం కల్పించవలసినదిగా కోరుతూ అర్జీ అందజేశారు. అలాగే మచిలీపట్నంలో నడుస్తున్న కృష్ణ యూనివర్సిటీ, ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ (నేషనల్ కళాశాల )అనుబంధ సంస్థలు, డిగ్రీ , బీఈడీ, ఐటిఐ, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న అనేకమంది టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి కనీస వేతన చట్టాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన కనీస వేతనాలు అందడం లేదని వారికి వేతనాలు చెల్లించాలని కోరుతూ అర్జీలు అందజేశారు.

మచిలీపట్నం కరగ్రహానికి చెందిన మహమ్మద్ సహనా బేగం ఎండి వహీదా, పివి కుమారి, ఫాతిమా బేగం, హసీనా బేగం మరికొందరు తమ కాలనీ నిర్మించి 45 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు మురికి కాలువలు ఏర్పాటు చేయలేదని, దీంతో వాడకం నీరు, వర్షపు నీరు రహదారుల మీద నిలబడిపోయి మంచినీటి పంపులకు మొదల్లోకి వచ్చి తాగునీరు కలుషితం అవుతుందని, మురికి కాలువ వ్యవస్థ లేదా కనీసం కచ్చా కాలువ అయినా ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు

చల్లపల్లి మండలం రామానగరంకు చెందిన బివిఎన్ రాణి తన తండ్రి టీ భాస్కర్ రావు అని, తమ్ముడు టివిఎన్ ఆంజనేయులు బుద్ధి మాంద్యంతో పాటు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడని చెబుతూ తమ్ముడితో కలిసి కలెక్టరేట్కు రాగా జిల్లా కలెక్టర్ వేదికనుండి దిగి వారి వద్దకు వచ్చి వారి సమస్యను ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వారు తమ తండ్రి ద్వారా సంక్రమించిన పెంకుటిల్లు పక్క స్థలంలో ఉన్న వ్యక్తి తమపై కోర్టులో కేసు వేసి 15 లక్షల రూపాయలు ప్రామిసరీ నోటు దొంగ సంతకంతో పుట్టించి ఆ మొత్తం చెల్లింపు చేశాక అమ్ముకోవాలని తమకు నోటీసు పంపించారని, వాస్తవంగా ఆ పెంకుటిల్లు ఉండే స్థలం తమదేనని, దొంగ సంతకాలతో అతను కోర్టులో కేసు వేశారని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఒకవైపు వారు న్యాయవాదిని పెట్టుకుని అదే కోర్టులోనే దొంగ సంతకాల అని కేసు దాఖలు చేయాలని, ఇంకొకవైపు దొంగ సంతకాలతో తమ స్థలాన్ని కబ్జా చేసినట్లు పోలీసులకు డాక్యుమెంట్లతో సహా ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు.

ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం కృష్ణా జిల్లా కమిటీ కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు మాట్లాడుతూ ఈ సంవత్సరం సార్వా పంటకు నాణ్యమైన వరి విత్తనాలు 75% సబ్సిడీతో అందజేయాలని, డీఏపీ కాంప్లెక్స్ ఎరువు యూరియా, ఎం ఓ పి ఎరువులు ఇబ్బందులు లేకుండా రైతులకు సరఫరా సరఫరా చేయాలని, మేజరు మైనరు మురికి కాలువల్లో పూడికలు,ఆటంకాలు పూర్తిస్థాయిలో తొలగించాలని, మోంథా తుఫాను నష్టపరిహారం అందించాలని, మైనింగ్ పేరుతో మట్టిని రైతాంగం అవసరాలకు తోలుకునే వాహనాలపై పన్నులు లేకుండా ఉచిత అనుమతి ఇవ్వాలని కోరుతూ అర్జీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీసీఈవో డాక్టర్ జే అరుణ, డ్వామా, డి ఆర్ డి ఏ. పి డి లు శివప్రసాద్, హరిహరనాథ్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సోమశేఖర్, పంచాయతీరాజ్ ఎస్.ఈ రమణ రావు, గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజు, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *