MachilipatnamLocal News
May 11, 2026
జిల్లా

కిశోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్‌కు శ్రీకారం – పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

  • May 4, 2026
  • 1 min read
[addtoany]
కిశోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్‌కు శ్రీకారం – పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో కిశోర బాలికలు, బాలురు సమగ్ర అభివృద్ధి మరియు శక్తివంతీకరణ లక్ష్యంగా “కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ 2026” కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ డి. కె. బాలాజీ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ వారి కిషోరి వికాసం పోస్టర్‌ను ఆవిష్కరించి, ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. మే 1, 2026 నుండి జూన్ 11, 2026 వరకు ప్రత్యేకంగా రూపొందించిన సమ్మర్ క్యాలెండర్ ప్రకారం ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అమలు చేయబడుతుంది.

ఈ క్యాంపెయిన్ ద్వారా కిశోర బాలికలకు,బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్య మేళాలు, అనీమియా నివారణ, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం , హెచ్ఐవి/ఎయిడ్స్ అవగాహన, చట్టాలపై జ్ఞానం మరియు (POCSO, PCMA, DV, RTE), ఆర్థిక నిర్వహణ, శారీరక వ్యాయామం, విద్య మరియు కెరీర్ మార్గదర్శకత్వం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించబడుతుంది. అదేవిధంగా సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, బాల్య వివాహాల నిరోధం, బాలికల భద్రత వంటి ముఖ్య అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

ఈ కార్యక్రమం అమలులో వివిధ లైన్ డిపార్ట్మెంట్స్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు మరియు లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పాల్గొంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కిశోర బాలికల సమగ్ర అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని, సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో లైన్ డిపార్ట్మెంట్స్, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎమ్ ఎన్ రాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.కిషోర్, నోడల్ ఆఫీసర్ సుధా రాణి, ఈ ఓ విజయలక్ష్మి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *