MachilipatnamLocal News
June 19, 2026
మచిలీపట్నం

రోగులకు మరింత మెరుగైన సేవలు: ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లీలా ప్రసాద్

  • June 19, 2026
  • 0 min read
[addtoany]
రోగులకు మరింత మెరుగైన సేవలు: ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లీలా ప్రసాద్

మచిలీపట్నం:

మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచనలు, సహకారంతో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లీలా ప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి ప్రగతి, అందుతున్న సేవల వివరాలు తెలియజేశారు.

రికార్డు స్థాయిలో వైద్య సేవలు

సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రతిరోజూ సుమారు 1,200 మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారనీ, నెలకు 30 వేల మందికి పైగా రోగులు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారని అన్నారు. ప్రతి నెల సగటున 500 మేజర్ శస్త్రచికిత్సలు, 1,000 నుంచి 1,500 వరకు మైనర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నాం.

ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన సౌకర్యాల కల్పన, పరిశుభ్రత నిర్వహణ అంశాలపై మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సూపరింటెండెంట్ వివరించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీల మార్గదర్శకత్వంలో ఆసుపత్రిలో శానిటేషన్, పరిశుభ్రత, రోగుల వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎంఓ భానుమూర్తి, వైద్యులు పాల్గొన్నారు.

About Author

SSN