MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

మత గ్రంథాలను అవమానించినందుకు ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలి

  • April 21, 2026
  • 0 min read
మత గ్రంథాలను అవమానించినందుకు ప్రకాష్ రాజ్ పై చర్యలు తీసుకోవాలి
మచిలీపట్నం :
 
 కేరళలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం, మహాభారతం పట్ల వ్యంగ్యంగా మాట్లాడారని దీనిపై ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని కృష్ణాజిల్లా విశ్వహిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు కూనపురెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం, మహాభారతాన్ని అవహేళన చేసి మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. హిందూ అనేది మతం కాదని సంస్కృతి అని అన్నారు. పురాణాలను అవమానించి నందుకు ప్రకాష్ రాజు పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం హిందువులు అందరూ కలిసి ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా విశ్వహిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *