MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

అధికార పార్టీ వారికి ఆదాయ వనరులుగా మారిన ఇసుక – మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్

  • April 13, 2026
  • 0 min read
అధికార పార్టీ వారికి ఆదాయ వనరులుగా మారిన ఇసుక – మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్
మచిలీపట్నం :
 
పామర్రు మాజీ శాసనసభ్యులు కైలా అనిల్ కుమార్ ఇసుక రవాణాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇసుక రవాణా అధికార పార్టీకి చెందిన వ్యక్తులకు ఆదాయ వనరుగా మారిందని ఆయన విమర్శించారు.
సోమవారం మచిలీపట్నంలో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన ఆయన, పామర్రు నియోజకవర్గ అవసరాల కోసం ప్రణాళికాబద్ధంగా ఇసుక పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఇసుక పంపిణీలో వివక్ష చూపకుండా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
అధికార పార్టీ మద్దతు ఉన్న వారికే అనుమతులు ఇవ్వడం సరికాదని పేర్కొన్న ఆయన, అక్రమ ఇసుక రవాణాను ప్రశ్నిస్తే గత విషయాలను ప్రస్తావిస్తూ తప్పించుకోవడం ప్రజాప్రతినిధులకు తగదని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు.
అలాగే ముఖ్యమంత్రి ప్రతిపాదించిన “మావిగాన్” ఆలోచనపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పామర్రు శాసనసభ్యులు కుమార్ రాజా రెవెన్యూ అధికారులను అవినీతిపరులుగా చిత్రీకరించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *