స్థానిక పరాసుపేట లో వేం చేసి యున్న శ్రీ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు మే 9 నుండి 17 వరకు జరుగు సందర్బముగా పందిరి గుంజ సోమవారం ఉదయం పాట పాడటం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వాహణాధికారి తిక్కిశెట్టి వీర వెంకట మోహనరావు ఆలయ చైర్మన్ ఆలపాటి రమేష్ పాలక వర్గం సభ్యులు విశ్వనాధ పల్లి నాగరాజు, మానేపల్లి ఉషారాణి ,మోపర్తి ఉమాదేవి , జంపాని కనక దుర్గా రాజేష్ , నందిపాముల శ్రీనివాస్ ,ఐలా శివ నాగేశ్వరరావు మరియు భక్తులు పాల్గొన్నారు.