బుడమేరుపై వంతెన నిర్మాణానికి 104.12 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వ మంజూరు చేయడం పట్ల మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో ఏళ్ళుగా అత్యధిక వర్షపాతం నమోదైనపుడు మునిగిపోయే బుడమేరు వంతెన స్థానంలో ఆధునిక హంగులతో నూతన వంతెన నిర్మించి ఈ ప్రాంత ప్రజలు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించారు. మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్వల్లభనేని బాలశౌరి గతంలో వరద ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, ఈ వంతెన పలుమార్లు మునిగిపోవడం, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడం వంటి సమస్యలను ప్రజలనుండి సంగ్రహించి దీని శాశ్వత పరిష్కారానికి కృషి చేసారు.
దానిఫలితంగా భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజక వర్గంలోని కృష్ణా జిల్లాలోని నందివాడ మండలం పుట్టగుంట గ్రామం సమీపంలో నేషనల్ హైవే 216-హెచ్ పై బుడమేరు డ్రెయిన్‌పై కొత్తగా 2 వరసల పేవ్డ్ షోల్డర్స్ (2 ఎల్ పి ఎస్) కలిగిన ప్రధాన వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 104.12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది.