MachilipatnamLocal News
April 10, 2026
మచిలీపట్నం

ఇంటి కూల్చివేత ఘటనలో చట్టాలను పాటించలేదు: న్యాయవాది చంద్రాల గోపికృష్ణ

  • April 6, 2026
  • 0 min read
[addtoany]
ఇంటి కూల్చివేత ఘటనలో చట్టాలను పాటించలేదు: న్యాయవాది చంద్రాల గోపికృష్ణ
మచిలీపట్నం : 
 
స్థానిక కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇంటి కూల్చివేత ఘటనపై సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాధితుడు తరపు న్యాయవాది చంద్రాల గోపికృష్ణ పాల్గొని సవివరంగా మాట్లాడారు.
 
చట్టాలను, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా అన్యాయంగా శ్రీపతి వెంకటాచలంకి చెందిన ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని న్యాయవాది గోపికృష్ణ తెలిపారు.
 
జస్టిస్ గవాయ్ జస్టిస్ కె వి విశ్వనాథం నేతృత్వంలోని గౌరవ సుప్రీంకోర్టు అందించిన బుల్ డోజర్ జస్టిస్ తీర్పును అనుసరించి కొబ్బరి తోట ఇంటి నిర్మాణ కూల్చివేత ఘటనలో బాధితుడు శ్రీపతి వెంకటచలం కు నష్టపరిహారం అందించాలన్నారు.
 
కార్పొరేషన్ కమిషనర్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారన్నారు. శ్రీపతి వెంకటాచలానికి చెందిన ఇంటిని కూలదొయడం చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.
 
కొబ్బరి తోటలోని 1.59 ఎకరాల వెంచర్ లో మనిషికో రకంగా అనుమతులు కల్పిస్తూ, గౌరవ కోర్టులను సైతం అయోమయానికి గురి చేసేలా నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహరిస్తున్నారన్నారు.
 
కొబ్బరి తోట వెంచర్ కు సంబంధించిన ఇంటి నిర్మాణాలలో కృష్ణాజిల్లా జూనియర్ సివిల్ కోర్టులో ఒకలా, గౌరవ హైకోర్టులో మరోలా నివేదికలు అందిస్తూ గౌరవ కోర్ట్ లను సైతం నగరపాలక సంస్థ కమిషనర్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
 
ఓ ఎస్ నెంబర్ 409/2025 కృష్ణాజిల్లా జూనియర్ సివిల్ కోర్టులో శ్రీపతి వెంకటాచలానికి సంబంధించిన కేసు లో ఒకలా, ఓ ఎస్ నెంబర్ 3328/2024 గౌరవ హైకోర్టులో తోట నరేంద్ర కు చెందిన కేసులో మరోలా నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహరించడం కోర్టులను తప్పుదోవ పట్టించడమేనన్నారు.
 
కొబ్బరి తోట వెంచర్ లో తమకు హక్కు ఉందంటూ కొండపల్లి వారు చేస్తున్న వాదనలలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.
 
1941 నుండి 2026వ సంవత్సరం వరకు సుమారు 85 సంవత్సరాలు పాటు కొండపల్లి కి సంబంధించిన వారికి భూమికి ఎటువంటి సంబంధం లేదని పలు దఫాలుగా గౌరవ కోర్టులలో ప్రతికూలంగా తీర్పులు వచ్చాయన్నారు.
 
1964 సంవత్సరంలో కొండపల్లి కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి కొబ్బరి తోట వెంచర్ కి సంబంధించిన భూమిని విక్రయించి తద్వారా సొమ్మును పొందినట్లుగా గౌరవ కోర్టులో అంగీకరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.   
 
కనీసం చట్టాలపై గౌరవం లేకుండా అన్యాయంగా తన క్లైంట్ శ్రీపతి వెంకటాచలం కు చెందిన ఇంటిని కూలదొసిన మున్సిపల్ అధికారులు వారికి సహకరించిన పోలీస్ సిబ్బందిపై న్యాయపరంగా పోరాటం చేయడం తథ్యం అన్నారు. బాధితుడు వెంకటాచలంకు నష్టపరిహారం అందించే లాగా కృషి చేస్తామన్నారు.
 
కోర్టు అనుమతులతోనే కొబ్బరి తోట ఇంటిని కూల్చాం అంటున్న అధికారులు దానికి సంబంధించిన పత్రాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
 
చట్టాలపై గౌరవం లేకుండా అధికారులు మెప్పుల కోసం పొంతన లేని విధానాలను అవలంబిస్తే తిప్పలు పడతారన్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గుర్తించుకోవాలన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *