MachilipatnamLocal News
May 24, 2026
జిల్లా

ఏ ప్రాతిపదికన ఇల్లు కూల్చారు

  • May 23, 2026
  • 0 min read
[addtoany]
ఏ ప్రాతిపదికన ఇల్లు కూల్చారు

మచిలీపట్నం:

ఇల్లు కూల్చటమనేది చిన్న విషయం కాదు. మీరు ఏ ప్రాతిపదికన ఇల్లు కూల్చారు. మీరు పోలీసులను వ్రాతపూర్వకంగా రక్షణ కోరారా? ఏ ప్రాతిపదికన 200మంది పోలీసులను పంపించారు. మీరు బాధ్యత గల అధికారి. సమాజానికి సమాధానం చెప్పాలి. మీకు కోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా? లేదా పై అధికారులు ఆదేశాలు ఇచ్చారా? చెప్పండి . సెంట్రింగ్ వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా హడావిడిగా ఎందుకు కూల్చారు? వాళ్ళేమైనా టెర్రరిస్టులా? అది ప్రభుత్వ ఆస్తి కాదు. మీరు ప్రభుత్వ అధికారి. రెండు సంవత్సరాలు ఇక్కడ ఉంటారు. తరువాత వెళ్ళిపోతారు. ఇద్దరి ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారంలో అధికారులు ఆస్థిని ధ్వంసం చేయడం నేను ఎక్కడా చూడలేదు. మీరు దీనికి సమాధానం చెప్పాలి?

శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దిశా సమావేశంలో మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ బాపిరాజు పై మచిలీపట్నం నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలసౌరి కురిపించిన ప్రశ్నల వర్షం ఇది. ఎంపీ నుంచి ఊహించని ప్రశ్నల పరంపరకు మౌనముద్ర కమిషనర్ సమాధానం అయింది. ఏప్రిల్ 1, బుధవారం అక్రమ కట్టడమంటూ సుమారు 200మంది పోలీసు పహారాతో స్థానిక కొబ్బరి తోట ప్రాంతంలో జనసేన సానుభూతి పరుడు శ్రీపతి వెంకటాచలం ఇంటిని మునిసిపల్ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆ కూల్చివేతకు సంబంధించి శనివారం ఎంపీ బాలసౌరి దిశా సమావేశంలో మునిసిపల్ కమీషనర్ బాపిరాజును ప్రశ్నించారు.

ఎంపీ పరిభాషలో ఇల్లు కూల్చటమనేది చిన్న విషయం కాదు. అలాగే జిల్లా స్థాయి సమావేశంలో మచిలీపట్నం మునిసిపల్ కమీషనర్ ని నిల్చోబెట్టి నిలదీయటం కూడా చిన్న విషయం కాదు. చూద్దాం! ముందు ముందు ఈ అంశం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

About Author

SSN