MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

ఆక్వాన్‌ తుఫాను ముప్పు.. నిత్యావసరాలు, ఇంధన కొరత లేకుండా ముందస్తు చర్యలు: డీఎస్ఓ టి. శివరామప్రసాద్

  • November 18, 2026
  • 0 min read
ఆక్వాన్‌ తుఫాను ముప్పు.. నిత్యావసరాలు, ఇంధన కొరత లేకుండా ముందస్తు చర్యలు: డీఎస్ఓ టి. శివరామప్రసాద్

మచిలీపట్నం:

ఆక్వాన్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా ప్రజలకు నిత్యావసర సరుకులు, ఇంధనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లాలోని ఎల్‌పీజీ గ్యాస్ డీలర్లు, పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి టి. శివరామప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తుఫాను కారణంగా రవాణా మరియు సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ నిల్వలను అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. వినియోగదారులకు నిరంతరాయంగా సేవలు అందేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కృత్రిమ కొరత సృష్టించడం గానీ, అధిక ధరలకు విక్రయించడం గానీ చేయరాదని హెచ్చరించారు.

ఇంధనాలు మరియు గ్యాస్ సరఫరా సజావుగా జరిగేలా సంబంధిత డీలర్లు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నందున, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా, నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యం పంపిణీలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్ఓ టి. శివరామప్రసాద్ ఆదేశించారు.

About Author

SSN