MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

ఈడేపల్లిలో దోమల నివారణ చర్యలు.. విస్తృతంగా ఫీవర్ సర్వే మరియు PDP కార్యక్రమం!

  • November 18, 2026
  • 1 min read
ఈడేపల్లిలో దోమల నివారణ చర్యలు.. విస్తృతంగా ఫీవర్ సర్వే మరియు PDP కార్యక్రమం!

మచిలీపట్నం:

మచిలీపట్నం పరిధిలోని ఈడేపల్లి 47వ సచివాలయం, UPHC నారాయణపురం పరిధిలో దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే మరియు PDP కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు రాఘవేంద్ర గారు మరియు సూరిబాబు గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. దోమల పెరుగుదలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, దోమల లార్వా వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి PDP పనులను ముమ్మరంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN