MachilipatnamLocal News
September 23, 2026
జిల్లా

కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం ఘనంగా పూర్తి: పేర్ని నాని ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కారం

  • September 22, 2026
  • 0 min read
కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాలం ఘనంగా పూర్తి: పేర్ని నాని ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సత్కారం
  • ప్రజా సమస్యల పరిష్కారంలో జెడ్పీ పాలకవర్గం నమూనాగా నిలిచింది: మాజీ మంత్రి పేర్ని నాని
  • ప్రలోభాలకు లొంగకుండా జెడ్పీటీసీలు, ఎంపీపీలు బాధ్యతాయుతంగా పనిచేశారు

మచిలీపట్నం:

మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్‌లో కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గ పదవీకాల ముగింపు ఆత్మీయ సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక నాయకత్వంలోని పాలకవర్గ పదవీకాలం సెప్టెంబర్ 24తో ముగియనున్న నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని పాల్గొని, ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులను (ఎంపీపీ) దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ప్రతిపక్షంలోనూ ప్రజా పక్షపాతిగా..

కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ.. చైర్‌పర్సన్ ఉప్పాల హారికతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు తమ ఐదేళ్ల పదవీకాలాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసుకున్నారని అభినందించారు. ముఖ్యంగా గడిచిన రెండేళ్ల కాలంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఎటువంటి ఒత్తిళ్లకు లేదా ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై నిలబడ్డారని కొనియాడారు. ప్రతి సర్వసభ్య సమావేశంలో అధికారుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకెళ్లి, ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను చేయించడంలో వీరు చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

SSN