MachilipatnamLocal News
September 23, 2026
జిల్లా

కృష్ణా జిల్లా పరిషత్‌లో రూ.23 లక్షలతో వాకింగ్ ట్రాక్ ప్రారంభం: జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ

  • September 23, 2026
  • 1 min read
కృష్ణా జిల్లా పరిషత్‌లో రూ.23 లక్షలతో వాకింగ్ ట్రాక్ ప్రారంభం: జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ

 * గత ఐదేళ్లలో రూ. 350 కోట్లతో అభివృద్ధి పనులు: జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పల హారిక

 * జిల్లా పరిషత్ ఆదాయ పెంపునకు 7 పెట్రోల్ బంకులకు ముందడుగు

మచిలీపట్నం:

మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో రూ. 23 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాకింగ్ ట్రాక్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కే. బాలాజీ మంగళవారం వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ તથા కృష్ణాజిల్లా జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) డాక్టర్ జె. అరుణ, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఆనంద కుమార్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ రమణారావులతో కలసి కలెక్టర్ వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు.

గ్రామీణాభివృద్ధికి రూ. 350 కోట్లు వినియోగం

వాకింగ్ ట్రాక్ ప్రారంభోత్సవం అనంతరం కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఉప్పల హారిక మాట్లాడుతూ.. గత ఐదేళ్ల కాలంలో జిల్లా పరిషత్ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 350 కోట్లతో విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఉద్యోగుల సంక్షేమం – మహిళా సాధికారత

మహిళల ఆర్థిక అభ్యున్నతిని కాంక్షిస్తూ రూ. 40 లక్షల వ్యయంతో సుమారు 300 నుండి 400 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు చైర్‌పర్సన్ తెలిపారు. పాలనా సంస్కరణల్లో భాగంగా దాదాపు 320 మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేయడంతో పాటు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి గుర్తింపు – ‘ఐసీఏఐ’ బెస్ట్ జెడ్పీ అవార్డు

2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ నిధులను అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించినందుకు గానూ జాతీయ స్థాయిలో ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ICAI) సంస్థ కృష్ణా జెడ్పీకి ‘బెస్ట్ జిల్లా పరిషత్’ అవార్డును ప్రకటించినట్లు చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ జాతీయ పురస్కారాన్ని అందరి తరఫున తాను అందుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

ఆదాయ మార్గాల విస్తరణ

జెడ్పీకి స్వయం సమృద్ధి, ఆదాయాన్ని సమకూర్చే దిశగా సీఈఓ డాక్టర్ జె. అరుణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, అందులో భాగంగా జిల్లాలో 7 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ అనుమతులు లభించాయని చైర్‌పర్సన్ హారిక సభకు వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

About Author

SSN