భారీ వర్షాల హెచ్చరిక: కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేడు సెలవు
మచిలీపట్నం:
వాతావరణ శాఖ నుంచి వచ్చిన భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నివేదికల ఆధారంగా, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రకాల పాఠశాలలకు బుధవారం (23.09.2026) లోకల్ హాలిడే (స్థానిక సెలవు) ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ మరియు ఇతర అన్ని యాజమాన్యాల పాఠశాల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేరొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

