MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయండి: కొట్టే వెంకట్రావు

  • September 1, 2026
  • 0 min read
పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయండి: కొట్టే వెంకట్రావు

మచిలీపట్నం :

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2న మచిలీపట్నంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనున్నట్లు జనసేన నాయకుడు కొట్టే వెంకట్రావు తెలిపారు. గాంధీనగర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వేడుకల వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా కొట్టే వెంకట్రావు మాట్లాడుతూ.. జన్మదిన వేడుకల్లో భాగంగా నగరంలో భారీ బైక్, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే మున్సిపల్ మహిళా కార్మికులకు చీరల పంపిణీ, ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు, కేక్ కటింగ్ అనంతరం సుమారు 5 వేల మందికి విందు భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అభిమానులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జనసేన నాయకులు శాయన శివయ్య, పృద్వి ప్రసన్న, వాలిశెట్టి మల్లి, మాధవి తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN