అభయ ఆంజనేయ స్వామికి విశేష పూజలు: చిలకలపూడిలో నేత్రపర్వంగా హనుమాన్ చాలీసా పారాయణం
మచిలీపట్నం:
మచిలీపట్నం చిలకలపూడి గోడౌన్స్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు కన్నులపండువగా సాగాయి. మాసపు మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో దివ్య అలంకరణలు నిర్వహించారు.
అనంతరం ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం శ్రద్ధాభక్తులతో చేశారు. మధ్యాహ్నం వెంట్రప్రగడ షణ్ముఖ ప్రసాద్ సౌజన్యంతో భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

