MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వరుసగా రెండోసారి ‘రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పతకం’

  • September 1, 2026
  • 1 min read
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వరుసగా రెండోసారి ‘రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పతకం’


మచిలీపట్నం:

సమాజ సేవ, మానవతా దృక్పథంతో అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గానూ కృష్ణా జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ అధ్యక్షుడు డీకే బాలాజీని ప్రతిష్టాత్మక ‘రెడ్ క్రాస్ సేవా స్వర్ణ పతకం’ వరించింది. ఆయన ఈ పురస్కారాన్ని వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సాధారణ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ ఈ అవార్డును అందుకున్నారు.

కృష్ణా జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీని పటిష్టం చేయడంలో కలెక్టర్ డీకే బాలాజీ కీలక పాత్ర పోషించారు. పక్కా ప్రణాళికతో సభ్యత్వ నమోదు చేపట్టడం, సంస్థకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడం, రక్తదాన శిబిరాలు, విపత్తు నిర్వహణ, ఆరోగ్య-సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో ఆయన చూపిన చొరవను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించారు. వరుసగా రెండోసారి ఈ పతకం రావడంపై కృష్ణా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డి.ఆర్.కె. ప్రసాద్, కార్యదర్శి శంకర్‌నాథ్, కార్యవర్గ సభ్యులు కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను, అత్యవసర సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

About Author

SSN