MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

LIC 70వ వార్షికోత్సవం: మచిలీపట్నంలో ఘనంగా బీమా వారోత్సవాల ప్రారంభం

  • September 1, 2026
  • 1 min read
LIC 70వ వార్షికోత్సవం: మచిలీపట్నంలో ఘనంగా బీమా వారోత్సవాల ప్రారంభం

మచిలీపట్నం:

జీవిత బీమా సంస్థ (LIC) 70వ సంస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలోని ఎల్.ఐ.సి డివిజనల్ కార్యాలయం వద్ద ‘బీమా వారోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జడ్జి వరలక్ష్మి మాట్లాడుతూ, ఎల్.ఐ.సి పాలసీదారులకు నిరంతరం మెరుగైన సేవలు అందిస్తూ, మున్ముందు మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా పేదలకు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రూ. 57.29 లక్షల కోట్ల ఆస్తులతో మార్కెట్ లీడర్‌గా ఎల్.ఐ.సి

కార్యక్రమంలో ఎల్.ఐ.సి సీనియర్ డివిజనల్ మేనేజర్ నున్న నాగేశ్వరరావు సంస్థ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. బీమా రంగంలో ఎల్.ఐ.సి తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ వాటా: పాలసీల విక్రయంలో 65.16%, ప్రీమియం ఆదాయంలో 56.66% వాటాతో ఎల్.ఐ.సి దేశీయ బీమా రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు.ప్రస్తుతం సంస్థ రూ. 57.29 లక్షల కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉందన్నారు. సెప్టెంబర్ 1 నుండి 7 వరకు వారం రోజుల పాటు వివిధ రకాల సేవా, సమాజహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవంలో డివిజనల్ అధికారులు మహమ్మద్ ఖాజా, M.S. సుబ్రమణ్యం, KDVS. కృష్ణ, CH. వెంకట రమణ, సీనియర్ అడ్వకేట్ CH. ముసలయ్యతో పాటు వివిధ సంఘాల నాయకులు, ఎల్.ఐ.సి ఉద్యోగులు, ఏజెంట్లు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

About Author

SSN