MachilipatnamLocal News
May 11, 2026
జిల్లా

జిల్లా స్థాయిలో సత్తా చూపిన లేడియాంప్తుల్ విద్యార్థినిలు

  • April 15, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా స్థాయిలో సత్తా చూపిన లేడియాంప్తుల్ విద్యార్థినిలు
మచిలీపట్నం :
 
గురువారం ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల కంటే మచిలీపట్నం లేడీ యాంప్తుల్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు జిల్లాలో ప్రథమ స్థాయిలోనూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జిల్లాలో రెండవ స్థానంలో నిలిచి కాలేజీ యొక్క ప్రతిష్టను పెంచారు. 
 
మొదటి సంవత్సరం 327 మంది విద్యార్థులు హాజరు కాగా 269మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం 311 మంది హాజరు కాక 281 మంది ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరాల కంటే ఎంతో మెరుగుగా కళాశాల ఫలితాలు రావడం పట్ల కళాశాల అభివృద్ధి కమిటీ మాజీ కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు సభ్యులు లంకిశెట్టి బాలాజీ, అభినందనలు తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలను జిల్లాస్థాయిలో నిలిపినందుకు కళాశాల ప్రిన్సిపాల్ పి. లక్ష్మి ఇతర అధ్యాపకులను అభివృద్ధి కమిటీ అభినందనలు తెలియజేసింది.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *