మచిలీపట్నం :
అవనిగడ్డ, గుడివాడ సబ్‌డివిజన్‌ల డీఎస్పీలుగా బాధ్యతలు స్వీకరించిన పాల శ్రీనివాసరావు (గుడివాడ),ఆర్.అభిషేక్ (అవనిగడ్డ) సోమవారం జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన డీఎస్పీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ బాధ్యతలను నిబద్ధతతో, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలను సున్నితంగా, సహానుభూతితో విని, చట్టపరమైన పరిధిలో తక్షణ పరిష్కారం చూపేందుకు కృషి చేయాలని అన్నారు.అలాగే, తమ పరిధిలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా సైబర్ నేరాలు, మహిళల భద్రత, యువతలో వ్యసనాల నివారణ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగి, పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించే విధంగా పనిచేయాలని, ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకుని సమయానికి పరిష్కరించాలని తెలిపారు. పోలీసు శాఖ ప్రతిష్టను పెంపొందించేలా కృషి చేయాలని, టీమ్‌వర్క్‌తో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.