వ్యక్తిని అరెస్ట్ 15 కేజీల వెండి స్వాధీనం
మచిలీపట్నం :
రాష్ట్ర మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు. 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న అంతర్రాష్ట్ర నేరస్తుడు దొడ్లోజి బాబు అలియాస్ రవిబాబుని అరెస్ట్ చేసి, అతని వద్దనుండి సుమారు 15 లక్షల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నిందితుల వివరాలు తెలిపారు. నిందితుడు దొడ్లోజి బాబు అలియాస్ రవిబాబు లారీ క్లీనర్ గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించే ఆలోచనతో దొంగతనాలు పాల్పడుతున్నట్లు తెలిపారు. గుడివాడ టూ టౌన్ పరిధిలోని ఆంజనేయ పేట లో నివాసం ఉంటున్న రాష్ట్ర మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ కు చెందిన ఇంట్లో మార్చి 14 న దొంగతనంపై వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ గుడివాడ టూ టౌన్ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు. ఘటన స్థలంలో ఆధారాల కోసం సాంకేతికతను ఉపయోగించి మానవ మేదస్సుతో గుడివాడ టూ టౌన్ పోలీసులు కేసును చేదించడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు.