MachilipatnamLocal News
April 15, 2026
జిల్లా

జిల్లా ప్రజలు కంటిచూపు వ్యాధి గ్లకోమా పై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • March 9, 2026
  • 1 min read
[addtoany]
జిల్లా ప్రజలు కంటిచూపు వ్యాధి గ్లకోమా పై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:—–
 
జిల్లా ప్రజలు కంటిచూపు వ్యాధి గ్లకోమా పై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
 
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ నీటి కాసులు…. గ్లకోమా వ్యాధిపై రూపొందించిన గోడపత్రాన్ని ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిశ్శబ్దంగా చూపును ప్రభావితం చేసి చూపు తగ్గిపోయే ప్రమాదకరమైన వ్యాధి గ్లకోమా అని పేర్కొన్నారు. సాధారణంగా 40 సంవత్సరాల వయసు వారికి వస్తుందని, ప్రత్యేకించి కుటుంబంలో ఎవరికైనా నీటికాసులు ఉంటే వారికి కూడా వస్తుందన్నారు. 
ఈ గ్లోకోమా లక్షణాలు కనుగొడ్లు చుట్టూ రంగుల వలయాలు, నొప్పిగా ఉండడం, సరైన చూపు కాంతి లేకపోవడం ఉంటే నీటి కాసులు కావచ్చన్నారు.
 
కళ్ళజోడు తరచుగా మార్చవలసిరావడం జరుగుతుందన్నారు. నిలకడగా తరచుగా ఇంకా కళ్ళల్లో నొప్పి సరి అయిన, క్రమం తప్పని చికిత్స ద్వారా నీటి కాసులు వలన చూపులు కోల్పోకుండా కాపాడుకోవచ్చన్నారు. 
 
మరింత సమాచారం కోసం దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలన్నారు. 
 
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ ,డిఆర్ఓ చంద్రశేఖర రావు, మెప్మా పీడీ సాయిబాబు, డిఎస్పి శ్రీనివాసరావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, జిల్లా అందత్వ నివారణ సంస్థ కార్యక్రమం అధికారి ప్రొఫెసర్ భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *