వైజెఆర్ డిఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో వరల్డ్ ఓషన్ డే కార్యక్రమం నిర్వహణ
మచిలీపట్నం:
స్థానిక వైజెఆర్ డిఎంఎస్ ఇంజినీరింగ్ కళాశాల లో వరల్డ్ ఓషన్ డే సందర్భంగా పరిసర్ సంవాద్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారిచే పరిసరాల అవగాహన – సామాజిక స్పృహ అనే అంశం మీద విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా పరిసర్ సంవాద్ ఇండియా జాతీయ డిజిటల్ మీడియా ప్రతినిధులు మొహమ్మద్ ఉబెదుర్ రెహమాన్ , సహాబ్ తల్హా బేగ్ మొహమ్మద్ పాల్గొన్నారు.
రహ్మాన్ మాట్లడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా పర్యావరణాన్ని సిద్ధం చెయ్యాలని ప్రతీ విద్యార్థి మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా తగు రక్షణ చర్యలు చేబట్టాలని సూచించారు.
బేగ్ మొహమ్మద్ మాట్లాడుతూ పరిసరాల శుభ్రత ఒక సామాజిక బాధ్యత అని అందరూ దానికి కట్టుబడి ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య మెంబర్ వీరమాచినేని కిరణ్ , ప్రిన్సిపల్ డాక్టర్ టి. రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్
డాక్టరు బి. నాగజ్యోతి , హ్యుమానిటీస్ మరియు సైన్స్ విభాగాధిపతి డాక్టరు అబ్దుల్ నబి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

