MachilipatnamLocal News
June 14, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

  • June 12, 2026
  • 1 min read
[addtoany]
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం

మచిలీపట్నం:

మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 47 డివిజన్ నందు డిమార్ట్ రోడ్డు మేజర్ తాగునీటి ఆర్సిసి పంపింగ్ 350 ఎమ్ఎమ్  పైప్ లైన్ పగిలిపోవడం వలన ప్రధాన తాగు నీటి సరఫరా పైప్లైన్ తీవ్రంగా దెబ్బతిని భారీగా నీరు వృధా అవుతుంది. ఈ పైపులైన్ పగిలిపోవడం వల్ల నగరంలోని హెడ్ వాటర్ వర్క్స్ నందు పంపిణీ నిలుపుదల చేయవలసి ఉంది. 

దీని కారణంగా ఒకటి నుండి 50 వార్డులు ప్రజలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.  ఈ పైప్ లైన్ పనుల రిపేరు నిమిత్తం సదరు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుచున్నందున జూన్ 15, 2026 ఉదయం 7 గంటల నుండి జూన్ 16, 2026 ఉదయం 7 గంటల వరకు అనగా రెండు రోజులు ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవలసినదిగా మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

About Author

SSN