MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఉచిత క్యాన్సర్ నివారణ శిబిరానికి అపూర్వ స్పందన

  • March 23, 2026
  • 0 min read
ఉచిత క్యాన్సర్ నివారణ శిబిరానికి అపూర్వ స్పందన
మచిలీపట్నం :
 
      కొంగర భవాని జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కృష్ణా కమ్మవారి సంక్షేమ సంఘం, దివ్య డయాగ్నిస్టిక్స్ వారి సౌజన్యం తో కమ్మ వారి సంక్షేమ సంఘం భవనం లో సోమవారం ఏర్పాటుచేసిన  ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. 220 మంది పైగా పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరాన్ని బందర్ మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, 1 వార్డు టీడీపీ ఇంచార్జ్ బత్తిన దాస్, కృష్ణా కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు వేమూరి బాలు, సెక్రటరీ చేకూరి కోటేశ్వరరావు, కోశాధికారి ఎంవీఎన్ ప్రసాద్ ప్రారంభిచారు. 
       ఈ సందర్భంగా గొర్రెపాటి గోపీచంద్ మాట్లాడుతూ అత్యంత ఖరీదైన క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా చేయడం దీర్గ కాలముగా బాధపడుతున్న పేద ప్రజలకు ఎంతో ఉపయోగముగా ఉందని అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ ఎంతకి మానని పుండు లేక కురుపు, రొమ్ము ప్రదేశం లో గాని మరియెక్కడైన గడ్డలు, చాలాకాలమగా గొంతు బొంగురు పోవడం ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది అని అన్నారు. డాక్టర్ శైలజ మాట్లాడుతూ క్యాన్సర్ ఆరంభ దశలోనే క్యాన్సర్ ని గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని అత్యంత అధునాతనమైన మొబైల్ వాహనం లో ఈ శిబిరానికి వచ్చినవారికి రొమ్ములకు మెమోగ్రఫీ, గర్భాశయాలకు స్కానింగ్, యోనికి పాప్ స్మియర్, ఊపిరితిత్తులకు ఎక్సరే పరీక్షలు ఉచితంగా  నిర్వహించి రిపోర్టులు ఇవ్వబడతాయని అన్నారు.
ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారందరికీ కృష్ణా కమ్మ సంక్షేమ సంఘం వారు అల్పాహారము, భోజన సదుపాయాన్ని కల్పించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *