MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

చిలకలపూడి UPHC పరిధిలో ముమ్మరంగా ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు

  • November 13, 2026
  • 1 min read
చిలకలపూడి UPHC పరిధిలో ముమ్మరంగా ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు

మచిలీపట్నం:

సీజనల్ వ్యాధుల నియంత్రణ మరియు దోమల నివారణ చర్యలలో భాగంగా, ఈరోజు చిలకలపూడి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) పరిధిలోని 6వ వార్డు కొబ్బరి తోట – 1 మరియు కొబ్బరి తోట – 2 ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విస్తృతంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

కొబ్బరి తోట – 1 లో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడంతో పాటు ‘ఫ్రైడే డ్రై డే’ మరియు PDP (పరిసరాల పరిశుభ్రత) కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కొబ్బరి తోట – 1 మరియు కొబ్బరి తోట – 2 ప్రాంతాల్లోని డ్రైనేజీలు, నీరు నిల్వ ఉండే చోట్ల దోమల లార్వా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేశారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు సిబ్బంది అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమాల్లో హెల్త్ సూపర్‌వైజర్లు రాఘవేంద్ర రావు, భట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ కోటేశ్వరరావు, ANMలు రత్న, సుభాన్ బి మరియు ఆశా వర్కర్లు వాణి, పార్వతి, సుజాత, వనజ పాల్గొన్నారు.

About Author

SSN