MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

నాగుల చవితి వేడుకల్లో ఘనంగా అన్నసమారాధన

  • November 13, 2026
  • 0 min read
నాగుల చవితి వేడుకల్లో ఘనంగా అన్నసమారాధన

 * వన్నారు గ్రామంలో భక్తిశ్రద్ధలతో నాగేంద్రుని పూజలు

మచిలీపట్నం:

కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉత్తర మండలం, కానూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వన్నారు గ్రామంలో నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అన్నసమారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, అన్నసమారాధనలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు.

పండుగ సందర్భంగా ఉదయం నుంచే గ్రామంలోని భక్తులు నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో గోపు సత్యనారాయణ మరియు స్థానిక నాయకులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ వేడుకలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు చీటికీనేటి అయ్యప్ప, బోలిశెట్టి నాని, గోపు వెంకట రమణ, మోకా రాజు, గోపాలకృష్ణ, ఇవన రామాంజనేయులు, బోలిశెట్టి రంగా, చీటికీనేటి మణికంఠ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author

SSN