MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

ఉగాది వేడుకలు విజయవంతం చేద్దాం.!

  • March 18, 2026
  • 0 min read
ఉగాది వేడుకలు విజయవంతం చేద్దాం.!
మచిలీపట్నం:
       స్థానిక శంకర్ మఠంలో నిర్వహించే ఉగాది వేడుకలను విజయవంతం చేయాలని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పి ఆర్ కె మూర్తి కోరారు.
       బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గ సమావేశం మంగళవారం ఈడేపల్లిలో నిర్వహించారు. సమావేశంలో ఈనెల 19వ తేదీన గొడుగు పేట శంకరమఠంలో నిర్వహించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు కరపత్రాలను ఆవిష్కరించారు. గురువారం గొడుగు పేట శంకరమఠంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఏ ఆర్ కె మూర్తి కోరారు. 
శంకరమఠంలో సంగీత గానామృతం,
       బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ( ఘనాపాటి) వారిచే పంచాంగ శ్రవణం అనంతరం వివిధ రంగాలలో నిష్ణాతులైన బ్రాహ్మణ ప్రముఖులకు సన్మానాలు జరుగుతాయని తెలిపారు. ఉగాది వేడుకలను విజయవంతం చేయాలని మూర్తి కోరారు.
       ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పివి ఫణి కుమార్, మోపర్తి సుబ్రహ్మణ్యం, పి ఎస్ ఎస్ ఆర్ శర్మ, వడ్లమన్నాటి మారుతి దివాకర్, నిమ్మగడ్డ శ్రీధర్ లు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *