మచిలీపట్నం మెయిన్ రోడ్డు నుండి కోటా వారి తుళ్ల సెంటర్ వరకు ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. ట్రాఫిక్ సమస్యతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే కోటా వారి తుళ్ల సెంటర్ వద్ద ఒక పక్క వైన్ షాపు, ఇంకోవైపు పాల బూతులు, మరో ప్రక్క టిఫిన్ బండ్లు, చికెన్ పకోడీ బండి, చెరుకు రసం బండ్లతో మెయిన్ రోడ్ పై ట్రాఫిక్ జామ్ అవుతోంది. మెయిన్ రోడ్ అత్యంత రద్దీగా ఉండటంతో ఒక్క కానిస్టేబుల్ ట్రాఫిక్ నియంత్రణ చేయలేక పోతున్నారు.
అదే విధంగా ఈ సెంటర్ అవినిగడ్డ బైపాస్ రోడ్డు వాహనాలు, మరో ప్రక్క ఆవులు, గేదలు ఇవన్నీ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు వేసవి తాపం తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి సత్వరమే ట్రాఫిక్ నియంత్రణ చేయాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.