MachilipatnamLocal News
April 14, 2026
జిల్లా

జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

  • April 13, 2026
  • 0 min read
[addtoany]
జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం :
 
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ గవర్నమెంట్ హై స్కూల్‌లో ఎనిమిదవ రోజు నిర్వహించ బడుతున్న పదవ తరగతి పరీక్షా జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సందర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మూల్యాంకన ప్రక్రియను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
 
ఈ మూల్యాంకన కార్యక్రమంలో మొత్తం 775 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఇందులో 80 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు , 234 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *