శారద నగర్‌లో విస్తృతంగా ఆరోగ్య సర్వేలు
మచిలీపట్నం:
స్థానిక UPHC పరిధిలోని 30వ సచివాలయ పరిధిలో గల శారద నగర్‌లో ఈరోజు ఆరోగ్య శాఖ సిబ్బంది విస్తృతంగా ఇళ్ల వద్దకే వెళ్ళి వివిధ రకాల ఆరోగ్య సర్వేలు నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ టూ హౌస్ ఫీవర్ సర్వే (హౌస్ టు హౌస్ జ్వరాల సర్వే), పిడిపి (PDP) వర్క్, ఎంఎల్డి (MLD) సర్వే మరియు ఎన్ఎల్ఈపి (NLEP – కుష్టు వ్యాధి గుర్తింపు) సర్వేలను సమగ్రంగా చేపట్టినట్లు హెల్త్ సూపర్ వైజర్ తెలిపారు.
కాలానుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధుల నివారణ మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ సర్వే నిర్వహించారు. ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివర సేకరించడంతో పాటు, ఎవరికైనా జ్వరం లేదా ఇతర అనారోగ్య లక్షణాలు ఉంటే తక్షణమే వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత మరియు దోమల నివారణపై స్థానికులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ భట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎన్ఎమ్ (ANM) సుధారాణి మరియు ఆశా వర్కర్లు కళ్యాణి, రూప తదితరులు పాల్గొన్నారు.

