MachilipatnamLocal News
June 3, 2026
జిల్లా

పిఆర్సి పై పోరు బాట

  • March 3, 2026
  • 0 min read
[addtoany]
పిఆర్సి పై పోరు బాట
మచిలీపట్నం :
 
        పిఆర్సి విడుదల చేస్తారా ? ఉగాది పండుగ చేసుకోమంటారా? లేక రోడ్డుమీదకు రమ్మంటారా?” అంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు.
 
        ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పిఆర్సి వెంటనే విడుదల చేయాలని, నాలుగు డీఏ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా కాలం నుంచి ఇప్పటివరకు మరణించిన అనేక మంది ఉపాధ్యాయుల కుటుంబాలకు ఇప్పటికీ తగిన కారుణ్య నియామకాలపై చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
         ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో భారీ ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *