MachilipatnamLocal News
May 25, 2026
జిల్లా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ

  • May 25, 2026
  • 0 min read
[addtoany]
ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ

మచిలీపట్నం:

సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డి ఆర్ ఓ కే చంద్రశేఖరరావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, డీఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి అర్జీలు స్వీకరించారు. నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు.

అర్జీల వివరాలు:
మచిలీపట్నం మండలం, సుల్తానగరం నుండి కంకటావ, ముక్కొల్లు మీదుగా డోకిపర్రుకు వెళ్ళే ఆర్ అండ్ బి రహదారి మరమ్మతుల పనుల నిమిత్తం 2026 జనవరిలో పనులు ప్రారంభించి ఉన్న రోడ్డును తొలగించి ఆ పనులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని, దీనివల్ల కంకర రాళ్లు పైకిలేచి వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్టీసీ బస్సు సైతం గ్రామానికి రావడం లేదని, తమ ఇబ్బందులను గుర్తించి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గ్రామానికి చెందిన పలువురు అర్జీ ద్వారా విన్నవించారు.

ఎన్నో సంవత్సరాలుగా కుమ్మరిపాలెం దళితవాడలో ఉన్న లంకమ్మ తల్లి ఆలయంలోకి దళితులకు ప్రవేశం నిరాకరించడం జరుగుతోందని, కొంతమంది అగ్రకుల పెత్తందారులు దళిత కుటుంబాలకు ఉద్దేశిపూర్వకంగా ప్రవేశం నిరాకరిస్తున్నారని దీనిపై తగిన విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోడూరు మండలం కుమ్మరిపాలెం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు అర్జీ ద్వారా విన్నవించారు.

బంటుమిల్లి మండలం, పెద్దతుమ్మిడి శివారు మల్లపరాజుగుడెం గ్రామ ఏరియాలో ఆర్.ఏస్.నెం 189లో పాత హరిజనవాడ రహదారిని గ్రామానికి చెందిన కొంతమంది ఆక్రమించుకుని షెడ్డు నిర్మించుకున్నారని, దీని గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియజేస్తూ, ఆక్రమణను తొలగించి ఇబ్బందులను తొలగించాలని గ్రామానికి చెందిన డివివి సత్యనారాయణ తదితరులు అర్జీ సమర్పించారు.

కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN