MachilipatnamLocal News
April 15, 2026
మచిలీపట్నం

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం

  • March 12, 2026
  • 0 min read
[addtoany]
పేర్ని కిట్టు ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
16వ వసంతంలోకి అడుగుపెట్టిన పార్టీ.. 
 
మచిలీపట్నం :
      ​   వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, పార్టీ నాయకులు పేర్ని కిట్టు (పేర్ని కృష్ణమూర్తి) ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ స్థాపించి విజయవంతంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుని, 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా పేర్ని కిట్టు పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. ​
       పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కార్యకర్తలు పడుతున్న శ్రమను పేర్ని కిట్టు కొనియాడారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే వైఎస్ఆర్సిపి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 
         ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగర మేయర్, స్థానిక కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల నినాదాలతో కార్యాలయ ప్రాంగణం మారుమోగింది.
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *