MachilipatnamLocal News
April 15, 2026
ఫీచర్స్

శాస్త్రోక్తంగా శ్రీ హేమకోదండ రామ స్వామి ఆలయ శిలా రాజగోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం

  • March 12, 2026
  • 1 min read
[addtoany]
శాస్త్రోక్తంగా శ్రీ హేమకోదండ రామ స్వామి ఆలయ శిలా రాజగోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం

మచిలీపట్నం :

      మంత్రి కొల్లు రవీంద్ర – నీలిమ దంపతులతో అయోధ్య నుండి విచ్చేసిన పండితులు మహంతి రాజ్ నాథ్ స్వామి శాస్త్రోక్తంగా బందరు కోటలో  శ్రీ హేమకోదండ రామ స్వామి ఆలయ శిలా రాజగోపుర శిఖర  ప్రతిష్ట చేయించారు. 
      ప్రతిష్టా మహోత్సవానికి హాజరైన కాకినాడ శ్రీపీఠం  శ్రీ పరిపూర్ణానంద సరస్వతీ స్వామీజీ, గుడివాడ ప్రణవాశ్రమం శ్రీవిద్యాపీఠం శ్రీ స్థైర్యానంద సరస్వతీ స్వామీజీలకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
      మంత్రి కొల్లు రవీంద్ర – నీలిమ దంపతులు హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సరయు నది పవిత్ర జలాలతో స్వామి వారికి విశేష అభిషేకాలు జరిపారు.  
      ఈ శిఖర ప్రతిష్ట, పూజా కార్యక్రమాలకు మచిలీపట్నం పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన నిర్వహకులు అన్నప్రాసాదం సైతం ఏర్పాటు చేశారు. విద్యార్థులు, కళాకారులచే ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *