MachilipatnamLocal News
April 9, 2026
జిల్లా

పెనమలూరు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.

  • April 4, 2026
  • 1 min read
[addtoany]
పెనమలూరు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర.

– అత్యంత నాణ్యంగా మధ్యాహ్న భోజనం

 
– ప్రతి విద్యార్ధికి సరైన పోషకాహారం అందించేలా ఏర్పాట్లు
– సన్నబియ్యం, ఆకుకూరలతో ప్రత్యేక భోజనం
– 155 కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్‌ ద్వారా నాణ్యమైన ఆహారం
 
మచిలీపట్నం :
 
 ప్రభుత్వ స్కూళ్లలో చదివే ప్రతి పిల్లవానికి నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌ను స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో కలిసి మంత్రి పరిశీలించారు. స్కూల్ స్టోర్ రూం పరిశీలించి సరుకుల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యతను దగ్గరుండి పరిశీలించారు. పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్కూల్లో విద్యార్ధులు రూపొందించిన పలు ప్రాజెక్టులను పరిశీలించారు.
 
 గత ఐదేళ్లు మధ్యాహ్న భోజనం అంటేనే విద్యార్ధులు భయపడే పరిస్థితి దాపురించింది. రేషన్ బియ్యంతో అన్నం వండడంతో ముద్దలుగా మారి తినడానికి ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సన్నబియ్యంతో కూడిన ప్రత్యేక మెనూ ప్రకటించాం. ప్రతి విద్యార్ధికి అన్ని రకాల పోషకాలతో కూడిన ఆహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. 155 కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి ప్రతి స్కూల్కు ఆహారం పంపిస్తున్నాం. ఇందుకోసం ప్రతి ఏటా రూ.2161 కోట్ల బడ్జెట్ కేటాయించడం హర్షణీయం. ప్రైవేటు స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం. తాగునీటి కాలుష్యానికి చోటు లేకుండా ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. కాలం చెల్లిన గుడ్లు అందే అవకావం లేకుండా ఒక్కో వారం ఒక్కో రంగుతో గుడ్లు అందిస్తున్నాం.
 
 రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ద పెట్టి.. సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి రాగానే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించారు. చాగంటి కోటేశ్వరరావు గారిని ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్ధులకు విలువలు నేర్పిస్తున్నాం. 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపైనా ప్రత్యేక చర్యలు తీసుకునేలా చొరవ చూపిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *