MachilipatnamLocal News
July 21, 2026
మచిలీపట్నం

ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు – వైసీపీ శ్రేణుల నిరసన

  • April 9, 2026
  • 0 min read
[addtoany]
ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు – వైసీపీ శ్రేణుల నిరసన
మచిలీపట్నం :
 
మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణ పై వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకు వినతిపత్రం ఇచ్చారు.
వైసీపీకి చెందిన మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ,వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేయడం దిగజారుడు చర్య అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం మంత్రి వంగళపూడి అనిత కూడా ఈ ఘటనను ఖండించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
మహిళల రక్షణ అంటే కేవలం పథకాలు అమలు చేయడం మాత్రమే కాదని, మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *