MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

పట్టాభి భవన్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

  • November 19, 2026
  • 1 min read
పట్టాభి భవన్‌లో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

మచిలీపట్నం:

మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత ఇందిరా గాంధీ గారి 109వ జయంతి వేడుకలు పట్టాభి భవన్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా కమిటీ మరియు పట్టణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ముందుగా జిల్లా జనరల్ సెక్రెటరీ కొడమంచిలి చంద్రశేఖర్, నగర అధ్యక్షులు అబ్దుల్ మతిన్ తదితర నాయకులు ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ కొనియాడారు.

ఈ సందర్భంగా నగర అధ్యక్షులు అబ్దుల్ మతిన్ మాట్లాడుతూ.. దేశ సేవకై తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన మహానీయురాలు ఇందిరా గాంధీ అని పేర్కొన్నారు. జిల్లా జనరల్ సెక్రెటరీ కొడమంచిలి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశ సమగ్రత, ఐక్యతతో పాటు పేద ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఆమె విశేష కృషి చేశారని తెలిపారు.

ఏపీసీసీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు మహమ్మద్ దాదా మాట్లాడుతూ.. భారతదేశపు తొలి మహిళా ప్రధానిగా, ‘భారత ఉక్కు మహిళ’గా ఇందిరా గాంధీ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారని గుర్తు చేశారు. అనంతరం చిలుకోటి ప్రసాద్ మాట్లాడుతూ.. బ్యాంకుల జాతీయీకరణ, ‘గరీబీ హటావో’ వంటి విప్లవాత్మక సంస్కరణలతో దేశ ప్రగతికి ఆమె బలమైన పునాదులు వేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గరికపాటి శంకర్, జిల్లా సోషల్ మీడియా నాయకులు నల్లబోలు సామ్యూల్, కాంగ్రెస్ నాయకులు అల్లాబక్షు, సైఫుల్లా, ఆయుబ్, వీరబాబు, వసంత తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN