విద్యార్థులకు చట్టాలపై అవగాహన.. గూడూరు జెడ్పీ హైస్కూల్‌లో డీఎల్ఎస్ఏ ప్రత్యేక సదస్సు
గూడూరు / మచిలీపట్నం:
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) మరియు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. డీఎల్ఎస్ఏ సెక్రటరీ ఎస్. వరలక్ష్మి ఆధ్వర్యంలో నవంబర్ 24, 2026 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాలలో భాగంగా, గురువారం గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.
ఈ సందర్భంగా బాలల హక్కులు, రక్షణ కోసం ఉద్దేశించిన ‘సురక్షిత బచ్‌పన్ అభియాన్’, లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO Act) గురించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. అలాగే మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ‘నాల్సా డాన్ స్కీమ్’ (Drug Awareness and Wellness Navigation – DAWN) ద్వారా విద్యార్థులను చైతన్యపరిచి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమాలలో డీఎల్ఎస్ఏ న్యాయవాదులు సోగన క్రాంతి శ్రీ, ఎం.బి.ఎల్. మణిమాల పాల్గొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. గూడూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ సదస్సులలో పాల్గొన్నారు.
#Guduru #Machilipatnam #DLSA #NALSA #LegalAwareness #POCSOAct #DrugAwareness #DAWNScheme #KrishnaDistrict #SreeSyamNews #SSN #SSNews #StudentSafety

