MachilipatnamLocal News
September 5, 2026
మచిలీపట్నం

నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

  • April 5, 2026
  • 0 min read
నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
మచిలీపట్నం :
 

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను మచిలీపట్నం నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మల్కా పట్టణంలోని బాబు జగజ్జివన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా మచిలీపట్నం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ మతిన్ మాట్లాడుతూ దళిత ముద్దుబిడ్డ అయినటువంటి జగ్జీవన్ రామ్  స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని అనంతరం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలలో రక్షణ శాఖ, రైల్వే శాఖ, కార్మిక శాఖ, వ్యవసాయ శాఖ లకు కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ కోకా ఫణిభూషణ్, ముప్పిడి కోటేశ్వరావు, సీనయ్య బాజీ వెంకటేశ్వరరావు, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *