MachilipatnamLocal News
November 22, 2026
జిల్లా

మురసు తుఫాను ప్రభావం: రేపు కృష్ణా జిల్లాలోని పాఠశాలలకు సెలవు

  • November 2, 2026
  • 1 min read
మురసు తుఫాను ప్రభావం: రేపు కృష్ణా జిల్లాలోని పాఠశాలలకు సెలవు

మచిలీపట్నం:

తీవ్రరూపం దాల్చుతున్న ‘మురసు’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. తుఫాను కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం (తేదీ 03-11-2026) పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి (DEO) వెల్లడించారు.

ఈ కాంపెన్సేటరీ సెలవు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు మరియు వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలన్నింటికీ వర్తిస్తుందని జిల్లా విద్యాశాఖ స్పష్టం చేసింది. జిల్లాలోని అందరు ఉప విద్యాశాఖాధికారులు (DyEOs), మండల విద్యాశాఖాధికారులు (MEOs) మరియు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ సెలవు ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీఈఓ ఆదేశించారు. అంతేకాకుండా, రేపు ఇస్తున్న సెలవుకు పరిహారంగా తదుపరి వచ్చే ఏదైనా ప్రభుత్వ సెలవు దినాన పాఠశాలలు పనిచేయాల్సి ఉంటుందని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తుఫాను తీవ్రత దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని జిల్లా విద్యాశాఖ సూచించింది.

About Author

SSN