MachilipatnamLocal News
July 15, 2026
మచిలీపట్నం

మాన్యులకు ఒక న్యాయం సామాన్యులకు మరొక న్యాయమా?

  • April 3, 2026
  • 0 min read
[addtoany]
మాన్యులకు ఒక న్యాయం సామాన్యులకు మరొక న్యాయమా?
మచిలీపట్నం :
 
నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని అక్రమంగా కూల్చివేశారని చదలవాడ వీరేంద్ర, శ్రీపతి భానుమూర్తి శుక్రవారం కొబ్బరి తోట నందు నిర్వహించిన విలేకరుల సమావేశం లో తమ ఆవేదన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరేంద్ర మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు నూతనంగా నిర్మిస్తున్న భవనమును ఎందుకు కూల్చివేశారో అర్థం కావటం లేదన్నారు. ప్లాన్ అప్రూవల్ ఇవ్వడానికి అధికారులు, కొబ్బరి తోట లో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని ఆదేశాల మేరకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 
నగరంలో అనుమతులు లేని నిర్మాణాలు అనేకం ఉన్నాయని వాటిని ఈ విధంగానే కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు. స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర ఏ అనుమతి తీసుకొని బెల్లం కొట్టు సందులో కమర్షియల్ బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపట్టారు? వాటిని కూల్చివేసే ధైర్యం అధికారులకు ఉందా? అని అన్నారు. మేము సామాన్యలం కాబట్టే మాపై ఈ చిన్న చూపు అని అధికారులను విమర్శించారు. మాన్యులకు ఒక న్యాయం సామాన్యులకు మరొక న్యాయమా? అన్నారు. పొలిటికల్ వ్యవస్థ పై తమకు నమ్మకం లేదని న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని అన్నారు. తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను మీడియా ముందు చూపించారు. వాటినే కోర్టులో సాక్ష్యాలుగా ప్రొడ్యూస్ చేస్తామన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *