MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ: కెయూ వీసీ ఆచార్య కె. రాంజీ

  • November 16, 2026
  • 1 min read
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ: కెయూ వీసీ ఆచార్య కె. రాంజీ

కృష్ణా విశ్వవిద్యాలయం – బ్లాక్‌బక్స్ సంస్థ మధ్య కీలక అవగాహన ఒప్పందం

మచిలీపట్నం:

మారుతున్న పారిశ్రామిక అవసరాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో కృష్ణా విశ్వవిద్యాలయం కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన ‘బ్లాక్‌బక్స్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థతో విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి (వీసీ) ఆచార్య కె. రాంజీ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో పరిశ్రమ ఆధారిత శిక్షణ అందిస్తామని తెలిపారు.

ఉపాధి, ఇంటర్న్‌షిప్ అవకాశాల కల్పన

కేవలం సాంకేతిక శిక్షణకే పరిమితం కాకుండా, విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేసేందుకు కెరీర్ రెడీనెస్ కార్యక్రమాలు, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మరియు ప్లేస్‌మెంట్ సన్నద్ధత సెషన్లను నిర్వహిస్తామని వీసీ పేర్కొన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాజెక్ట్ ఆధారిత శిక్షణ ద్వారా ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ మరియు ఉద్యోగ నియామక అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఒప్పంద పత్రాలపై కృష్ణా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, బ్లాక్‌బక్స్ సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి. వీరబ్రహ్మాచారి, కెయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై.కె. సుందర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

​

About Author

SSN