MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయ 9వ స్నాతకోత్సవం జనవరి 5కి వాయిదా – డిగ్రీల దరఖాస్తుకు డిసెంబర్ 20 వరకు గడువు పొడిగింపు

  • November 16, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయ 9వ స్నాతకోత్సవం జనవరి 5కి వాయిదా – డిగ్రీల దరఖాస్తుకు డిసెంబర్ 20 వరకు గడువు పొడిగింపు

మచిలీపట్నం: 

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో  2026 నవంబర్ 5వ తేదీన నిర్వహించవలసిన 9వ స్నాతకోత్సవం పరిపాలనా కారణాల వల్ల 2027 జనవరి 5వ తేదీకి వాయిదా వేయబడినట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య పి. వీరబ్రహ్మచారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందేందుకు దరఖాస్తులు సమర్పించడానికి గతంలో నిర్ణయించిన చివరి తేదీని పొడిగిస్తూ, 2026 డిసెంబర్ 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. 2025 మార్చి 1వ తేదీ నుండి 2026 నవంబర్ 30వ తేదీ వరకు తమ సంబంధిత కోర్సుల పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన విద్యార్థులు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సూచనలు, నిర్దేశిత విధానాన్ని అనుసరించి 2026 డిసెంబర్ 20వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన విద్యార్థులు మరలా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

అర్హులైన విద్యార్థులందరూ ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నిర్దేశిత గడువు అనంతరం మరలా గడువు పొడిగించబడదని విశ్వవిద్యాలయం తెలియజేసింది. మరింత సమాచారం కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.kru.ac.in ను సందర్శించవలసిందిగా కోరారు.

About Author

SSN