చిలకలపూడి బిసి సంక్షేమ బాలికల హాస్టల్‌లో దోమతెరల పంపిణీ
మచిలీపట్నం :
చిలకలపూడి యూపీహెచ్‌సీ పరిధిలోని బీసీ సంక్షేమ బాలికల హాస్టల్‌ను మలేరియా అధికారి డా జ్ఞానశ్రీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థినుల ఆరోగ్య భద్రత దృష్ట్యా, దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలలో భాగంగా డా జ్ఞానశ్రీ చేతుల మీదుగా విద్యార్థినులకు దోమతెరలను పంపిణీ చేశారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులకు మరియు హాస్టల్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ మురళి, హెల్త్ సూపర్ వైజర్లు రాఘవేంద్ర రావు, భట్రాజు సూరిబాబు, ఏఎన్ఎం శ్రీదేవి, ఆశా వర్కర్లు నాగలక్ష్మి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

