MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

రైలుపేట యూపీహెచ్‌సీ పరిధిలోని బిసి గర్ల్స్ కాలేజీ హాస్టల్‌లో దోమతెరల పంపిణీ

  • November 4, 2026
  • 0 min read
రైలుపేట యూపీహెచ్‌సీ పరిధిలోని బిసి గర్ల్స్ కాలేజీ హాస్టల్‌లో దోమతెరల పంపిణీ

మచిలీపట్నం:

స్థానిక రైలుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పరిధిలోని బి.సి. గర్ల్స్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థినులకు బుధవారం దోమతెరలను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారుల సూచనల మేరకు విద్యార్థినులకు దోమతెరల వినియోగంపై, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఈ పంపిణీ కార్యక్రమంలో రైలుపేట యూపీహెచ్‌సీ మెడికల్ సిబ్బంది, హెల్త్ సూపర్‌వైజర్లు పి. రాఘవేంద్రరావు, బట్రాజు సూరిబాబు, హెల్త్ అసిస్టెంట్ మేడూరి చంద్రమోహన్‌తో పాటు హాస్టల్ వార్డెన్ తేళ్ళ అనిత మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

SSN