కోలాహాలంగా మంత్రి కొల్లు రవీంద్ర పుట్టిన రోజు వేడుకలు
నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
మచిలీపట్నం:
వందల మంది కార్యకర్తలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, సేవా కార్యక్రమాల నడుమ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పుట్టిన రోజు వేడుకలు అంత్యంత వైభవంగా జరిగాయి. మచిలీపట్నం బందలదొడ్డిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని.. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు తోపుడు బండ్లు, కొత్త బట్టలు పంపిణీ చేశారు. ప్రజల కోసం నిత్యం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఎంత తోడ్పాటు అందించినా తక్కువేనని పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బెగ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జార్జికారనేషన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూలు పుస్తకాలు, యూనిఫాం అందించారు. రాజుపేట కొత్త మసీదులోని మదర్సాలో మైనార్టీ నాయకులు షేక్ బాజానీ, అమీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. చింతచెట్టు సెంటర్ వద్దనున్న జారీ ఆస్థానంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అన్నదానం కేంద్రాన్ని ప్రారంభించి భోజనం వడ్డించారు. దేశాయిపేట హైస్కూల్‌లో విద్యార్ధులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్ధులకు యూనిఫాం, బుక్స్ పంపిణీ చేశారు. 26వ డివిజన్ టీడీపీ కమిటీ సభ్యులు ఎండీ జిలానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించారు. కోనేరు సెంటర్లో మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైనీ ఎడ్యుకేషనల్ సొసైటీలో టీడీపీ నేత ఐపీసీ కరుణకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. విద్యార్ధులకు పుస్తకాల కిట్ పంపిణీ చేశారు. 44వ డివిజన్ ఇంఛార్జి మంచాల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. అన్నదానం ప్రారంభించారు. 50వ డివిజన్ ఇంఛార్జి పడమట నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించారు. పేదలకు మందులు పంపిణీ చేశారు.

విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎక్సైజ్ ఉద్యోగులు, మైనింగ్ ఉద్యోగుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు చూపించే ఆదరాభిమానాల ముందు ఎంత కష్టమైనా చిన్నదిగా అనిపిస్తోందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తోంది. వారికి చివరి శ్వాస వరకు సేవలు అందిస్తానని, వారికి ఏ కష్టమూ రాకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

