కారుణ్య నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం:
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఊరటనిచ్చారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.
మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన వారసులకు నియామక పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు విధుల పట్ల అంకితభావంతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని సూచించారు. జిల్లా పరిపాలన ప్రజలకు సేవ చేసే వ్యవస్థ అని, బాధ్యతాయుతంగా పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కారుణ్య నియామకాలలో భాగంగా నలుగురిని జూనియర్ అసిస్టెంట్లుగా, ముగ్గురిని ఆఫీస్ సబార్డినేట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం కారుణ్య నియామకాల ద్వారా అండగా నిలుస్తోందని అధికారులు పేర్కొన్నారు.

